Lokesh 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నయువగళం పాదయాత్ర..!
Lokesh Padayatra : యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు.
యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లింలకి ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం, వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మైనార్టీలను మోసం చేశారని పేర్కొన్న ఆయన మైనార్టీలను ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఆదుకున్నది టీడీపీ మాత్రమే అని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నా కానీ ముస్లిం సమస్యలు వారికి పట్టవని అన్నారు.
వక్ఫ్ ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేస్తుంటే వైసీపీ మైనార్టీ ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించడం లేదని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో మైనార్టీలపై 46 దాడులు, 10 హత్యలు జరిగాయని పేర్కొన్న ఆయన పుంగనూరులో 12 మంది మైనార్టీల పై అక్రమ కేసులు పెట్టి కొట్టి జైలుకు పంపారని పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు గుర్తింపులు లేవని..బీసీ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. రాజకీయంగా వాడుకుంటున్నారని.. వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. రియల్ టైం టెక్నాలజీతో ఆదుకుంటానన్నారు. జీ ప్లస్ 3 ఇళ్లు, మగ్గాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నారు. పింఛన్లు ఎత్తేశారని.. జీఎస్టీతో నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.