Turkey Earthquake : హోటల్ శిథిలాల కింద కనిపించిన భారతీయుడి మృతదేహం
టర్కీలో 3 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో 1800 మంది ఇస్తాంబుల్ లో ఉండగా, 250 మంది అంకారాలో ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ భూకంపం ధాటికి 25 వేల మంది చనిపోయినట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది
Turkey Earthquake : టర్కీ భూకంపం సునామిని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భూకంపం ధాటికి వేల మంది మృత్యువాత పడ్డారు. టర్కీ భూకంపం తర్వాత ఓ భారతీయుడు కనిపించకుండా పోయాడు. ఫిబ్రవరి 6న టర్కీలో భూకంపం సంభవించిన రోజు నుంచి అతడు కనిపించకుండా పోయాడు. చివరకు అతడి మృతదేహం కుప్పకూలిపోయిన హోటల్ బిల్డింగ్ శిథిలాల కింద కనిపించింది.
అతడి పేరు విజయ్ కుమార్. ఉత్తరాఖండ్ కు చెందిన విజయ్ కుమార్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. బిజినెస్ ట్రిప్ కోసం టర్కీకి వచ్చాడు. మలాట్యాలోని ఓ హోటల్ లో బస చేస్తున్నాడు. ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపం ధాటికి అతడు ఉంటున్న హోటల్ కుప్పకూలిపోయింది. ఆ హోటల్ శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. విజయ్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు టర్కీలోని భారత ఎంబసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Turkey Earthquake : టర్కీని ఆదుకున్న భారత్
టర్కీ భూకంపం తర్వాత సహాయక చర్యల కోసం భారత్ పూనుకుంది. ఆర్మీతో పాటు ఇతర సహాయక సిబ్బంది, మెడికల్ సిబ్బంది, మెడికల్ కిట్ ను టర్కీకి పంపించింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో రెస్క్యూ టీమ్ ను భారత్.. టర్కీకి పంపించింది. టర్కీలో 3 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో 1800 మంది ఇస్తాంబుల్ లో ఉండగా, 250 మంది అంకారాలో ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ భూకంపం ధాటికి 25 వేల మంది చనిపోయినట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 32 వేల మంది టర్కీకి చెందిన సిబ్బందితో పాటు మరో 8294 మంది అంతర్జాతీయ రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. 1939 లో 7.8 తీవ్రతతో టర్కీలో వచ్చిన భూకంపానికి అప్పుడు 33 వేల మంది మృత్యువాత పడ్డారు. తాజాగా వచ్చిన భూకంపానికి 25 వేల మందికి పైనే మృత్యువాత పడ్డారు.