అండమాన్ లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్దరాత్రి భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.9గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ ఘటనను ధ్రువీకరించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కేంద్రం అండమాన్ సముద్రంలో ఉన్నట్లు పేర్కొంది. భూకంపం కేంద్రం 77 కి.మీ లోపల ఉన్నట్లు పేర్కొంది. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అండమాన్ సముద్రంలో 77 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.