India: దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రదేశాలు మనస్సుకు హత్తుకుంటాయి. కొందరు వీటిని రొమాంటిక్ ప్లేస్‌లు అంటారు. ఎందుకంటే ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్లేస్‌లు అవి. ఇక జీవితాంతం అక్కడే ఉండిపోతే బాగుంటాది అనిపించే ప్లేస్‌లు. మరి ఆ మోస్ట్ రొమాంటిక్ ప్లేస్‌లు ఏవో.. ఎక్కడ ఉన్నాయో లేటు చేయకుండా తెలుసుకుందాం.
ఇండియాలోని ఫేమస్ హిల్ స్టేషన్లలో మున్నార్ ఒకటి. పచ్చటి తేయాకు తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలాంటి అందమైన ప్రదేశంలో జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుంది. దేశంలో ఎక్కువమంది మున్నార్‌ను రొమాంటిక్ ప్లేస్ అంటుంటారు. ఒక్కసారైన ఈ ప్లేస్‌ను చూడటం మిస్ కావద్దు.
హావ్లాక్ ఐలాండ్
అండమాన్ నికోబార్ దీవుల్లో హావ్లాక్ ఐలాండ్ ఉంది. ఇది చాలా ఫేమస్ ఐలాండ్. ఇక్కడి క్రిస్టల్ క్లియర్ వాటర్, బంగారు వర్ణంలోని ఇసుక తీరం, అమేజింగ్ రిసార్ట్స్ ఉంటాయి. ఈ ప్రదేశం చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
పాపులర్ హిల్ స్టేషన్ల్లో డార్జిలింగ్ ఒకటి. ఇక్కడి వాతావరణానికి చాలామంది ఫిదా అయిపోతారు. అంత అందంగా ఇక్కడి వాతావరణం ఉంటుంది. ఈ సుందరమైన ప్రదేశంలో రైలు ప్రయాణం చేస్తే జీవితంలో మర్చిపోలేరు.
ఉదయ్‌పూర్
సిటీ ఆఫ్ లేక్స్‌గా పేరున్న ఉదయ్‌పూర్ పట్టణాన్ని ఒక్కసారైన చూడాల్సిందే. లగ్జరీ ప్యాలెసీలు, హోటల్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పిచోలా సరస్సుపై తేలియాడే రెస్టారెంట్లు ఇంకా బాగుంటాయి.
అలెప్పీ
కేరళలోని అలెప్పీ హౌజ్ బోట్‌ను ఎక్కువగా కపుల్స్ విజిట్ చేస్తుంటారు. బ్యాక్ వాటర్స్‌లో హౌజ్ బోట్ ప్రయాణం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు.