»Donald Trump In The Race For The Nobel Peace Prize
Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారిగా శాంతి ఒప్పందాలు కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర వహించాడని రిపబ్లిక్ పార్తీ ఎంపీ క్లాడియా టెన్నీ వెల్లడించారు.
Donald Trump in the race for the Nobel Peace Prize
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)కి నామినేట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీ(Republic Party) ఎంపీ క్లాడియా టెన్నీ నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది నాలుగోసారి. మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారిగా శాంతి ఒప్పందాలు కుదరడంలో డొనాల్డ్ ట్రంప్ ముఖ్య పాత్ర పోషించారని టెన్నీ తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపించకుండా మధ్యప్రాచ్యంలో శాంతి ఒప్పందాలు కుదర్చడం సాధ్యం కాదని నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చాయని, కానీ ట్రంప్ చేసి చూపించారని టెన్నీ వివరించారు.
ఇంతటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేసిన ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతి కమిటీ గుర్తించడం లేదని, అందుకే మరోక్కసారి ఆయన పేరును నామినేట్ చేసినట్లు టెన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పోటీలో ఉండడానికి, రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ట్రంప్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.