»Imran Khan Another Shock For Imran 14 Years Imprisonment In Toshakhana Case
Imran Khan: ఇమ్రాన్‌కు మరో షాక్.. తోషఖానా కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తోషఖానా కేసులో ఆయనకు 14 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని భార్య బుష్రా బీబీకి కూడా శిక్ష పడినట్లు సమాచారం.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఇటీవల 10 ఏళ్లు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తోషఖానా కేసులో ఆయనకు 14 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని భార్య బుష్రా బీబీకి కూడా శిక్ష పడినట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఇది వరకే ఉన్నాయి. అయితే పాకిస్థాన్ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వెల్లిపోయిన తర్వాత తోషఖానాలో జమ చేయాలి.
తోషఖానాలో జమ చేయకపోతే నిబంధనలు ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ ఇమ్రాన్ ఖాన్ చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన దగ్గరే ఉంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని బహుమతులను విదేశాలకు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదని అనర్హత వేటు వేయడంతో జైలు శిక్ష విధించింది. అలాగే ఇమ్రాన్ దంపతులు సుమారుగా రూ.1.5 బిలియన్ల జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు అతనిపై 150 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.