గాయాల నుంచి తీసిన స్వాబ్‌తో పరీక్షలు నిర్వహించే అలినిటీ ఎం ఎంపీఎక్స్వీ టెస్టును అబాట్ మాలిక్యులర్ కంపెనీ అభివృద్ధి చేసింది. డీఎన్ఏ ఆధారంగా ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబోరేటరీ సిబ్బంది సులభంగా మంకీ పాక్స్ పరీక్షలు నిర్వహించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆఫ్రికా దేశాల్లో తక్కువ టెస్టులు, వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నూతన టెస్టు ఓ మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది.