TG: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది. 99 జీవోపై స్టే విధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. వెంటనే కూల్చివేతలను ఆపాలని కేఏ పాల్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని హైకోర్టు తెలిపింది. కూల్చివేతలకు నెల ముందు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. హైడ్రా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది.