సిద్దిపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని 2వ వార్డుకు చెందిన రాజు మూడు రోజుల క్రితం చేపలు పట్టడానికి సమీప వాగు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ రోజు పైకి తేలడంతో గుర్తించిన స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.