SRD: పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి వెన్నుపూస గాయంతో ఉపాధి లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడికి అండగా నిలిచారు. సొంత నిధులతో ఆటో అందించి తన ఉదారతను చాటుకున్నారు.