Rs.1 Lakh Note: రూ.లక్ష నోటు గురించి మీకు తెలుసా? దానిపై ఎవరి బొమ్మ ఉందంటే
రూ.లక్ష నోటు(Rs.1 Lakh Note)ను ముద్రించడం భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీస్ పాలనకు ప్రత్యామ్నాయంగా భారత సర్కార్ ఏర్పడటం సాధ్యమనే నమ్మకం బలంగా ఏర్పడింది. అప్పట్లో ఈ రూ.లక్ష నోటుకు ప్రపంచంలోని 10 దేశాల నుంచి మద్దతు లభించింది.
ఇప్పుడందరికీ రూ.2 వేల నోటు(2000 Note) టెన్షన్ పట్టుకుంది. కేంద్రం, ఆర్బీఐ(RBI) తీసుకున్న నిర్ణయంతో రూ.2 వేల నోటు కనుమరుగు కానుంది. దీనికంటే ముందు గతంలో రూ.లక్ష నోటు(Rs.1 Lakh Note) ఉండేది. అప్పట్లో రూ.లక్ష నోటు అంటే అదో పెద్ద చరిత్ర. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Netaji Subhash Chandrabose) రూ.లక్ష నోటును ప్రవేశపెట్టారు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వ(Ajad Hind sarkar) హయాంలో లక్ష రూపాయల నోట్లను ముద్రించారు. ఆ నోటుపై చంద్రబోస్ ముఖచిత్రం ఉండేది. ఆ బ్యాంక్ బర్మాలోని రంగూన్లో ఉంది. దీనినే బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు.
సుభాష్ చంద్రబోస్ ముద్రించిన రూ.లక్ష నోటు:
https://twitter.com/i/status/1659804215886200832
బ్రిటీష్ వారితో పోరాడే సైనికుల(Solidiers)కు విరాళాలు సేకరించడం కోసం ఆజాద్ హింద్ బ్యాంకు(Ajad Hind sarkar)ను నెలకొల్పారు. ఇండియా స్వతంత్ర దేశంగా మారుతుందని తెలియజేసేందుకు ఈ నోటును ముద్రించారు. దీంతో అంతర్జాతీయంగా ఇండియా(India) చట్టబద్ధమైన ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఈ నోటు ముద్రించడం వల్ల బ్రిటీస్ వారు విధించిన ఆర్థిక సంకెళ్ల నుంచి భారత్ విముక్తి పొందే దిశగా ముందుకు సాగింది. లక్ష రూపాయల నోటు(Rs.1 Lakh Note) అప్పట్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించింది.
రూ.లక్ష నోటు(Rs.1 Lakh Note)ను ముద్రించడం భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీస్ పాలనకు ప్రత్యామ్నాయంగా భారత సర్కార్ ఏర్పడటం సాధ్యమనే నమ్మకం బలంగా ఏర్పడింది. ఈ రూ.లక్ష నోటుకు ప్రపంచంలోని 10 దేశాల నుంచి మద్దతు లభించింది. బర్మా, జర్మనీ, చైనా, ఇటలీ, థాయ్లాండ్, ఐర్లాండ్ దేశాల బ్యాంకులు ఇండియా నుంచి ఆజాద్ హింద్ ప్రభుత్వం ముద్రించిన కరెన్సీని గుర్తించాయి. రూ.లక్ష నోటు వల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ నూతన అధ్యయనాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధమైంది.
100000 (One Lakh ) Rupee Note Issued by Bank of Independence of Netaji Subhas Chandra Bose pic.twitter.com/I82CsYT228