»Chinas Latest Laser Tech Claim Creates Waves Across The World
China చేతికి మరో అస్త్రం.. కొత్త టెక్నాలజీతో లేజర్ వెపన్
డ్రాగన్ చైనా చేతికి మరో అస్త్రం చేరింది. లేజర్ టెక్నాలజీతో కొన్ని కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని సునాయసంగా చేధించగలదని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.
China's Latest Laser Tech Claim Creates Waves Across The World
China’s Latest Laser Tech: డ్రాగన్ చైనా (China) మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. కొత్త లేజర్ టెక్నాలజీని చైనా (China) రక్షణ వ్యవస్థలోకి అందుబాటులోకి వచ్చింది. ఆయుధాల సాంకేతికతలో చైనా (China) సైన్యం పెద్ద పురోగతి సాధించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (morning post) తన కథనంలో రాసింది. ఆ లేజర్ నిర్విరామంగా ప్రయాణిస్తోందని.. యుద్దాల తీరుతెన్నులను పూర్తిగా మార్చేస్తుందని అంటోంది. చెంగ్షూలోని గల నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అధిక శక్తి లేజర్లను శక్తివంతం చేయడానికి అనుమతించే ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ డెవలప్ చేశారని వివరించింది.
కూలింగ్ సిస్టమ్ హై ఎనర్జీ లేజర్‌ను వేడెక్కకుండా శక్తిని అందిస్తోందని తెలిపింది. ఆయుధాలు తమ లేజర్ కిరణాలను అవసరమైనంత దూరం ప్రసరింప జేయొచ్చని చెప్పింది. యుద్ధ రంగంలో హై ఎనర్జీ లేజర్లను వాడుతున్న సమయంలో అనవసరమైన వేడి సృష్టించకుండా తమ వ్యవస్థ అడ్డుకుంటుందని వెల్లడించింది. హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలో ఇదీ ఓ విప్లవాత్మక పరిణామం అని నేషనల్ డిఫెన్స్ టెక్నాలజీ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫూ అభిప్రాయపడ్డారు. ఈ నెల 4వ తేదీన ఆక్టా ఆప్టిక్ సినికా అనే జర్నల్‌లో పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.
లేజర్ ఆయుధాలు వినియోగించే సమయంలో పుట్టే ఉష్ణం సమస్యగా మారుతుంది. సాంకేతిక సమస్యలకు కారణం అవుతోంది. హైగ్రేడ్ లేజర్ వ్యవస్థ నిర్మాణానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టివల్ హైఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ ఉన్నాయి. కొన్నింటిని అమెరికా పరీక్షించింది. హైపర్ సానిక్ క్షిపణులను ధ్వంసం చేయడానికి వినియోగించాలనే ఆలోచనలో ఉంది. లెజర్ల రేంజీ కొన్ని కిలోమీటర్లు మాత్రమే ఉంది. చైనా కనుగొన్న టెక్నాలజీ లేజర్ విధ్వంసక శక్తిని మరింత పెంచింది.