ఉత్తర అమెరికా జాలిస్కో రాష్ట్రం గాడలాజారలో రోజుకొకరు చొప్పున మిస్ అవుతున్నారు. గాడలాజార కాల్ సెంటర్ సమీపంలో గల ఓ లోయలో 45 బ్యాగులు కనిపించాయి. ఏంటా అని తెరచి చూస్తే.. అందులో శరీర భాగాలు కనిపించాయి.
45 Bag: ఉత్తర అమెరికాలో (North America) దారుణ ఘటన వెలుగుచూసింది. జాలిస్కో రాష్ట్రం గాడలాజారలో రోజుకొకరు చొప్పున మిస్ అవుతున్నారు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. గాడలాజార కాల్ సెంటర్ సమీపంలో గల ఓ లోయలో 45 బ్యాగులు (Bag) కనిపించాయి. ఏంటా అని తెరచి చూస్తే.. అందులో శరీర భాగాలు ఉన్నాయి.
కాల్ సెంటర్లో (call center) 30 ఏళ్ల వయస్సు ఉన్న ఏడుగురు పనిచేస్తున్నారు. మే 30వ తేదీ నుంచి వీరు కనిపించడం లేదు. వారి ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పని చేసే సంస్థ సమీపంలో ఓ లోయ ఉంది. అక్కడ 45 బ్యాగులు ఉండగా.. ఏంటా అని కొందరు తెరిచారు. శరీర భాగాలు ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి ఆ బ్యాగులను (Bag) తీసుకెళ్లారు.
బ్యాగుల్లో (Bag) విగతజీవులుగా ఉన్న వారెవరు.? మిస్సింగ్ అయిన వ్యక్తుల శరీర భాగాలే ఉన్నాయా..? బ్యాగులను (Bag) ఇక్కడ ఎవరు పడేశారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిజ నిజాలు మరికొద్దీ రోజుల్లో తెలియనుంది. ఇక్కడ బ్యాగులు పడేయటం.. అందులో శరీర భాగాలు ఉండటం కొత్త కాదట.. 2021లో టోనాలాలో 70 బ్యాగులు (Bag), 2019లో 29 యువకుల శరీర భాగాలతో 117 బ్యాగులు (Bag) కనిపించాయి. ఇప్పుడు 45 బ్యాగుల్లో (Bag) బాడీ పార్ట్స్ ఉన్నాయి. వారిని ఎవరు హతమార్చారు..? వారికి ఎవరితో వైరం ఉంది అనే కోణాల్లో పోలీసలు దర్యాప్తు కొనసాగుతోంది.