»Before The G20 Meeting Spain President Tested Covid Positive Not Attending G20 Delhi Summit
G20 summit:కు ముందే దేశాక్షుడికి కరోనా పాజిటివ్
భారత్‌లో జరగనున్న G20 సమ్మిట్‌కు తాను రాలేనని స్పెయిన్ అధ్యక్షుడు Pedro Sánchez చెప్పారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Before the G20 meeting spain president tested covid positive not attending g20 delhi summit
మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్(Pedro Sánchez) ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను ఈ సదస్సుకు హాజరు కాలేనని ప్రకటించారు. గురువారం కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తానే బాగానే ఉన్నానని, కానీ రాలేనని తెలిపారు. అయితే తనకు బదులుగా స్పెయిన్ వైస్ ప్రెసిడెంట్ నాడియా కాల్వినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20.
Me encuentro bien.
España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación.
మరోవైపు ఇప్పటికే రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్, చైనా(china)కు చెందిన జి జిన్‌పింగ్‌లు ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరగనుంది. యూరోపియన్ యూనియన్ నుంచి 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.