Viral News: విమానంలో (Flight) ఎయిర్ హోస్టెస్‌కు (Air Hostess) ముద్దు పెట్టేందుకు యత్నించి ఓ బంగ్లాదేశీయుడు (Bangladeshi National) ముంబయిలో అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 6న విస్తారా విమానం యూకే 234 మస్కట్ నుంచి ఢాకా బయలుదేరింది. గురువారం తెల్లవారు జామున ఆ విమానాన్ని ముంబయిలో ల్యాండ్ చేశారు. విమానం ముంబయి చేరుతుందనగా మహమ్మద్ దులాల్ అనే ప్రయాణికుడు పక్కనే ఉన్న ఎయిర్ హోస్టెస్‌ను ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు. ఆమె తేరుకునే లోపే ముద్దు పెట్టేందుకు యత్నించాడు. దీన్ని చూసిన ప్రయాణికులంతా అతన్ని మందలించే ప్రయత్నం చేయగా వారిపై అతను ఎదురుదాడి చేశాడు. దీంతో కెప్టెన్ జోక్యం చేసుకున్నాడు.
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తరువాత నిందితున్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు. వారు అతడిని సహర్ పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా.. శుక్రవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఎయిర్ హోస్టెస్ రూపాలి అగ్రెను పనివాడు అత్వాల్ దారుణ హత్య చేశాడు. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. ఇక లాభం లేదనుకొని హత్య చేశాడు.