»Bacteria In Chocolates Pregnant Women And The Elderly Are In Danger
Chacolate Recall: ఆ చాక్లెట్లలో బ్యాక్టీరియా..డేంజర్లో గర్భిణిలు, వృద్ధులు!
యూకేలోని క్యాడ్ బరీ కంపెనీ నుంచి తయారు చేసే చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా(Bacteria) చేరిందని పలు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. వీటి వల్ల గర్భిణులు, వృద్ధులకు డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాక్లెట్(Chacolate) తయారీ కంపెనీ అయిన క్యాడ్బరీ వివాదంలో చిక్కుకుంది. ఆ కంపెనీ నుంచి తయారు చేసే చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా(Bacteria) చేరిందని పలు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. యూకేలో ఈ విషయంపై ఆందోళన నెలకొంది. దీంతో వేలాది చాక్లెట్లను కంపెనీ వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. సూపర్ మార్కెట్లు, రిటైలర్లను క్యాడ్ బరీ కంపెనీ(Cadbury company) అలర్ట్ చేసింది. తమ కంపెనీ నుంచి తయారైన ఉత్పత్తులను దూరం పెట్టాలని బ్రిటన్ ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
క్యాడ్ బరీ కంపెనీ(Cadbury company) ఉత్పత్తులలో క్రంచీ, డైమ్, ఫ్లేక్, డైరీ మిల్క్ బటన్స్, డైరీ మిల్క్ చంక్స్, చాక్ లెట్ డిసర్ట్స్ కొనుగోలు చేసినవారు వాటిపై ఎక్స్పైరీ తేదీని చూసుకోవాలని యూకే ఫుడ్ స్టాండర్ట్స్ హెచ్చరికలు చేసింది. ఎక్స్పైరీ డైట్ మే 17, 18వ తేదీలలో కొనుగోలు చేసిన ఉత్పత్తులు తిరిగిచ్చేయాలని క్యాడ్ బరీ కంపెనీ ప్రకటించింది.
కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల లిస్టీరియోసిస్ ఇన్ఫెక్షన్ సోకుతుందని నిపుణులు హెచ్చరించారు. ఆ బ్యాక్టీరియా (Bacteria) సోకిన వారిలో ఫ్లూ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, జ్వరం, కండరాల నొప్పి, డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చేరిన బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాని యూకే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.