Ayesha Rashan: పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె!

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతికి భారతీయుడి గుండెను అమర్చారు. పాక్‌లోని కరాచీకి చెందిన ఆయేషా రహన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఉచితంగా వైద్యలు ఆమెకు గుండెను అమర్చారు.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 09:51 AM IST

Ayesha Rashan: పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతికి భారతీయుడి గుండెను అమర్చారు. పాక్‌లోని కరాచీకి చెందిన ఆయేషా రహన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారు. లేకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.35 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యలు తెలిపారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 25th)..శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు

ఈ క్రమంలో చెన్నైకు చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆమె సర్జరీకి భారత్‌లో ఏర్పాట్లు చేసింది. చెన్నైలోని ఎమ్‌జీఎమ్ హెల్త్‌కేర్ ఆసుపత్రి వైద్యులు ఆ యువతికి అవయవదానం చేశారు. భారతీయుడి గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకు ప్రాణం పోశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలో ఆమె పాకిస్థాన్‌కి వెళ్లిపోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.

 

Related News

Viral News: తీర్థంలో నిద్రమాత్రలు ఇచ్చి.. టీవీ యాంకర్‌‌పై అత్యాచారం చేసిన పూజారి

నిత్యం దైవారాధనలో ఉండే పూజారి ఓ టీవీ యాంకర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి తీర్థంలో మత్తిచ్చి లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటా అని దేవుడి మీద ఒట్టుపెట్టి కడుపు చేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.