»Two Of The Top 50 Cities With The Highest Number Of Millionaires Are In India
Rich Cities: కుబేరుల ఉండే నగరాల లిస్టులో రెండు సిటీలు ఇండియావే
ప్రపంచకోటీశ్వరుల నగరాల జాబితాను ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ చేపట్టిన సర్వేను తాజాగా బయటపెట్టింది. ఈ జాబితాలో భారతదేశంలోని రెండు నగరాలు ఉన్నాయి.
Two of the top 50 cities with the highest number of millionaires are in India
Rich Cities: ప్రపంచంలోని కోటీశ్వరుల సంఖ్య, వారి సంపదను బట్టి ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఓ సర్వేను చేపట్టింది. దాన్ని బట్టి కోటీశ్వరులు (సుమారు రూ. 8 కోట్లు), శత కోటీశ్వరులు సుమారు (రూ. 800 కోట్లు), అపర కుబేరులు (రూ. 8,000 కోట్లు)గా విభజించి మొత్తం టాప్ 50 నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ 50 నగరాల్లో అమెరికా దేశంలోని మొత్తం 11 నగరాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా న్యూయార్క్ నగరంలో 3,49,500 మంది కోటీశ్వరులు ఉన్నారు. గత పదేళ్లతో పోలిస్తే న్యూయార్క్ నగరంలో 48 శాతం పెరిగింది. 2013లో ప్రతి 36 మందిలో ఒకరు మాత్రమే ఏడంకెల ఆస్తిపరులు ఉండే ఇప్పుడు పత్రీ 24 మందిలో ఒకరు సంపన్నులు అయ్యారు.
ఇదే జాబితాలో ఇండియాలోని ముంబై, ఢిల్లీ నగరాలు చోటుదక్కించుకున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో 58,800 మంది కోటీశ్వరులు, 236 మంది శత కోటీశ్వరులు, 29 మంది అపర కుబేరులు నివసిస్తున్నట్లు ఈ జాబితాలో చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో 30,700 మంది మిలియనీర్లు, 123 మంది సెంటీ మిలియనీర్లు, 16 మంది బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. 2013తో పోలిస్తే ముంబైలో 82 శాతం మిలియనీర్ల వృద్ధి రేటు పెరిగిందని, అదేవిధంగా ఢిల్లీలో ఏకంగా 95 శాతం కోటీశ్వరుల వృద్ధి రేటు పెరిగిందని చెప్పింది. అలాగే గ్లోబల్ మిలియనీర్స్ సిటీలలో ముంబై 31, ఢిల్లీ 32వ స్థానాల్లో నిలిచాయి.