»Army Training For Pakistani Cricketers Do You Know Why
Army training: పాకిస్థాన్ క్రికెటర్లకు ఆర్మీ శిక్షణ.. ఎందుకో తెలుసా?
పాకిస్థాన్ క్రికెటర్లందరూ ఆర్మీ శిక్షణలో బిజీగా గడుపుతున్నారు. ఈ సంవత్సరం జరుగబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్‌కు ముస్తాబు అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Army training for Pakistani cricketers.. Do you know why?
Army training: పాకిస్థాన్ క్రికెటర్లు ఆర్మీ శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజనులు షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే వారు నిజంగానే ఆర్మీ శిక్షణ తీసుకుంటున్నారు. దానికోసం స్వయంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్టే ఆటగాళ్లను అక్కడి పంపింది. ఇదంతా వారి ఫిట్నెస్ కోసమే అని తెలుస్తుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2024 సీజన్ తరువాత జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకోవాలని, అందుకోసం జట్టు పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగేలా కాకుల్ ఆర్మీ క్యాంపులో కఠిన శిక్షణ ఇస్తోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో ఫిట్నెస్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అందుకే ఈ కఠిన శిక్షణ అన్నట్లు తెలుస్తంది.
చదవండి:Viral Video: క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని!
ఆర్మీ శిక్షణతో ఫిట్నెస్ సాధిస్తారని సైనికుల నేతృత్వంలో క్రికెట్ బోర్డు కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. కెప్టెన్ బాబర్ అజామ్ సారథ్యంలో జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపింది. దీంతో సైనిక శిక్షణకు సంబంధించిన వీడియోను ఆ జట్టు సభ్యుడు ఇఫ్తికర్ అహ్మద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణలో భాగంగా ఆటగాళ్లు ట్రెక్కింగ్, రోప్ క్లైంబింగ్ వంటి కఠిన వ్యాయమాలు చేస్తున్నారు. బాబర్ అజామ్, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు ఈ ఆర్మీ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నారు.