»2 Medals For India On The First Day Of Asian Games 2023
Asian Games 2023:లో తొలిరోజు భారత్ కు 2 పతకాలు
చైనాలో నిన్న ప్రారంభమైన ఆసియా గేమ్స్ 2023(Asian Games 2023)లో భారత్(bharat) మొదటి రోజు భోణి కొట్టింది. రెండు బ్యాక్ టు బ్యాక్ సిల్వర్ మెడల్స్ గెల్చుకుని పతకాల పట్టికలో ఖాతాను తెరిచింది. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బెర్త్ కోసం కసరత్తు చేస్తోంది.
2 medals for India on the first day of Asian Games 2023
ఆసియా క్రీడలు 2023(Asian Games 2023)లో నిన్న హాంగ్జౌలో ప్రారంభం కాగా..ఈ క్రీడల్లో ఆదివారం భారత బృందం దేశానికి తొలి పతకాలను గెల్చుకుంది. షూటింగ్, రోయింగ్ అథ్లెట్లు రెండు రజత పతకాలను గెలుచుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో మహిళా షూటర్లు మెహులీ ఘోష్, రమిత, ఆషి చౌక్సే రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే సమయంలో, పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో విజయం సాధించారు.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(china)లోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో 655 మంది సభ్యులతో కూడిన భారత బృందం పోటీపడుతోంది. ఈ 19వ ఎడిషన్ వేడుకలు అధికారికంగా సెప్టెంబర్ 23న ప్రారంభం కాగా..అక్టోబర్ 8న ముగుస్తాయి. ఈ ఎడిషన్ వాస్తవానికి 2022కి షెడ్యూల్ చేయబడింది. అయితే COVID-19 కారణంగా ఒక సంవత్సరం వాయిదా వేయబడింది. గత ఎడిషన్ జకార్తా 2018లో 570 మందితో భారత జట్టు బరిలోకి దిగగా..16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో 70 పతకాలను కైవసం చేసుకుంది. మరి ఈసారి ఎన్ని పతకాలు భారత్ గెల్చుకుంటుందో చూడాలి.
అయితే ఆసియా క్రీడలలో భారతదేశం(bharat) సాధించిన పతకాలలో ఎక్కువ భాగం అథ్లెటిక్స్ నుంచి రావడం విశేషం. భారత అథ్లెటిక్స్ జట్టులో పురుషుల జావెలిన్ త్రో ఏస్ నీరజ్ చోప్రా, స్టీపుల్‌చేజ్ రజత పతక విజేత అవినాష్ సేబుల్, మహిళల హర్డిల్స్ జ్యోతి యరరాజ్, నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పునియా, యాంటిమ్ పంఘల్, మను భాకర్, రుద్రాంక్ష్ పాటిల్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీరు తప్పకుండా పతకాలు గెల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాదు ఈ సారి భారత్ కూడా తొలిసారిగా ఆసియా క్రీడల్లో క్రికెట్ జట్లను బరిలోకి దింపుతోంది. పురుషులు, మహిళల రెండు జట్లు పాల్గొంటున్నాయి. ఫుట్‌బాల్, హాకీకి కూడా భారత్ ప్రాతినిధ్యం వహిస్తుంది.