Avoid These Gym Mistakes : ఆరోగ్యంగా ఉండాలని, సరైన శరీర తీరును కలిగి ఉండాలని చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు. రోజూ కనీసం ఓ గంట సమయం అయినా దాని కోసం కేటాయిస్తూ ఉంటారు. అయితే జిమ్(Gym) చేసేప్పుడు కొన్ని తప్పులు మాత్రం అస్సులు చేయకూడదు. అవేంటంటే.. వార్మప్ చేయడం, కూల్‌డౌన్ చేయండి. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే?
కొంత మంది జిమ్‌కు(Gym) వెళ్లీ వెళ్లడంతోనే కష్టతరమైన వ్యాయామాలు చేసేందుకు సిద్ధం అయిపోతుంటారు. ఇది మన శరీరానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. కష్ట తరమైన వ్యాయామాలు చేసే ముందు మనం కచ్చితం వార్మప్ ఎక్సర్సైజ్లు చేయాలి. దీంతో మన శరీరం అధికంగా శారీరక శ్రమ చేయడానికి సిద్ధం అవుతుంది. అలా కాకుండా ఒక్కసారిగా కష్టతరమైన వ్యాయామాలు చేస్తే గుండెపై ఒత్తిడి పడుతుంది. కొన్ని సార్లు అది ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. అలాగే వ్యాయామాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత చేసే కూల్‌డౌన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు సైతం మరిచిపోకూడదు.
ఇక వ్యాయామం చేసేప్పుడు చమటలు ఎక్కువగా పడతాయి. కాబట్టి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. కావాల్సినంత నీరు తాగాలి. జిమ్‌లో(Gym) కసరత్తులు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుండెల్లో నొప్పి అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకూడదు. పట్టించుకోకుండా ఇంకా వ్యాయామాలు చేయకూడదు. ఛాతీ భాగంలో నొప్పి ఎప్పుడు అనిపించినా వెంటనే వర్కవుట్లు ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. అలాగే జిమ్‌కి వెళ్లాలని నిశ్చయించుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. గుండెను చెక్ చేయించుకోవాలి. ఆయన సూచనల ఆధారంగా మీరు ఎలాంటి తీవ్రతతో వ్యాయామాలు చేయవచ్చనేది నిశ్చయించుకోవాలి.