ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్‌ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ICMR ప్రకారం 2022 సంవత్సరంలో భారతదేశంలో 14.6 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.. ఇది 2025 నాటికి 15.7 లక్షలకు పెరగవచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో, గత ఏడాది 8 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారనే వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. కానీ ఈ నూనెలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయట. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులు ఏ నూనెలు వాడాలో ఓసారి చూద్దాం.
ఆహారపు అలవాట్లను మారిస్తే ఇబ్బందులే. శరీరం తట్టుకోదు.. అలా ఓ ఇన్ ప్లూయెన్సర్ ఆకలితో అలమటించి చనిపోయింది. పచ్చి కూరగాయాలు, జ్యూస్ తీసుకోవడంతో శరీరం తట్టుకోలేకపోయింది.
వాటర్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మిచెల్.. చివరికీ ఆస్పత్రి పాలయ్యింది. రోజు 4 లీటర్ల నీరు మాత్రమే తీసుకున్న ఆమె.. 12వ రోజు వైద్యుడిని సంప్రదించాల్సి వచ్చింది.
మొన్నటి వరకు న్యూఢిల్లీ, చండీగఢ్, గుజరాత్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కండ్లకలక వ్యాధి..ఇప్పుడు తెలంగాణలో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దాదాపు 600 దాటేసింది. ఈ నేపథ్యంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు తల్లిదండ్రలకు సూచిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను ఇంట్లో ఎలా ఉంచుకోవాలా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పండ్లు లేదా కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అవి కుళ్లిపోతాయి. కుళ్ళిన తర్వాత వాటిని విసిరేయడం తప్పదు. దీనివల్ల డబ్బు వృథా అవుతుంది.
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అదే నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది. రెడ్ వైన్ రిలాక్సింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు. ఇది అన్ని వయసుల వారికి మంచిదేనట. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ అనేది నల్ల ద్రాక్షను బలపరిచే పానీయం. దీనిని ఆల్కహాలిక్ పానీయంగా మారుస్తుంది.
ఈ రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాలు మాత్రం కారణం కాదని తెలిపారు. కండ్ల కలక వ్యాప్తి నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు పాఠశాలలు బంద్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ రోజుల్లో పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అతిపెద్ద సవాలు గా మారింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా, నేటి పిల్లలు వేయించిన, ప్రాసెస్ చేసిన, చక్కెర పదార్థాలను ఇష్టపడతారు. జంక్ ఫుడ్ తప్ప వేరేవి తినడం లేదు. వారికి పౌష్టికాహారాన్ని అందించడం కష్టమౌతోంది. ఇలాంటి ఆహారాలు పిల్లల్లో ఊబకాయాన్ని కలిగిస్తాయి. అనేక పోషకాల లోపం ఉండవచ్చు.