Not only spinach, these foods can also help to correct iron deficiency
Health Tips: రక్తహీనత అనేది శరీరంలో ఇనుము లేకపోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్య. శరీరానికి సరిపడా ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి ఇది. ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంలో సహాయపడే ప్రోటీన్ అయిన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడానికి ఎర్ర రక్త కణాలకు ఐరన్ అవసరం. అలసట, బలహీనత మొదలౌతాయి. ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం దీనికి నివారణ. పాలకూరలో ఐరన్ ఉంటుందని మనకు తెలుసు. కానీ పాలకూరతో పాటు.. ఐరన్ కూడిన ఇతర ఆహారాలు ఉన్నాయి. వాటిని తిన్నా కూడా ఈ రక్త హీనత సమస్యను తగ్గంచవచ్చు.
1. మెంతులు
మెంతి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని సరిచేసి రక్తహీనతను నివారించవచ్చు. మెంతి ఆకులలో కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా ఉంటాయి.
2. బెల్లం
బెల్లం ఐరన్ కి అద్భుతమైన మూలం. కాబట్టి బెల్లం తినడం వల్ల ఐరన్ లోపాన్ని సరిచేసి రక్తహీనతను నివారించవచ్చు. బెల్లంలో పొటాషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం అధికంగా ఉండే బెల్లం తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మేలు చేస్తుంది.
3. డేట్స్
ఖర్జూరంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడానికి మరియు రక్తహీనతను నివారించడానికి ఖర్జూరాలను నానబెట్టడం మంచిది. ఖర్జూరంలో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం , జింక్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఖర్జూరంలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
4. ఎర్ర మాంసం
రెడ్ మీట్లో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా తినండి.
5. చిక్కుళ్ళు
చిక్కుళ్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత కూడా రాకుండా ఉంటుంది. చిక్కుళ్ళు కూడా ఫైబర్ కలిగి ఉంటాయి.
6. గింజలు
ఆహారంలో వేరుశెనగ వంటి గింజలను చేర్చుకోవడం కూడా ఇనుము లోపాన్ని సరిచేయడానికి సహాయపడుతుంది.