అతిగా ఆలోచించడం వల్ల కలిగే ప్రభావాలు మానసిక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కావు. అది మిమ్మల్ని శారీరక సమస్యలకు కూడా గురి చేస్తుందని తెలుసా? అవును, అతిగా ఆలోచించడం వల్ల శారీరక సమస్యలు ఎలా వస్తాయని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
అతిగా ఆలోచించడం వల్ల శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?
అతిగా ఆలోచించడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. మీరు అతిగా ఆలోచిస్తే, లేదా అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తే, మీ మనస్సు ఒత్తిడికి గురవుతుంది. రక్తపోటును పెంచుతుంది. స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి గుండె సమస్యలను కలిగిస్తుంది.
నిద్ర లేకపోవడం కారణం కావచ్చు
మీరు నిద్రించడానికి చాలా ప్రయత్నించినా మీ ఆలోచనలు మిమ్మల్ని నిద్రపోనివ్వవు. అతిగా ఆలోచించడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ ఆలోచిస్తే రాత్రి నిద్ర సరిగా పట్టదు. మరుసటి రోజు ఉదయం నీరసంగా, చిరాకుగా, అలసటగా ఉంటారు.
ఆకలితో ఉండకండి
అతిగా ఆలోచించడం వల్ల కొంతమందికి ఆకలి వేయదు. అది మెదడును బిజీగా ఉంచుతుంది. ప్రశాంతంగా మీరు ఆహారాన్ని తినలేకపోతారు. కాబట్టి ఎప్పుడూ ఆకలితో ఉండకండి. ప్రతి పూట తినడం మాత్రం మర్చిపోకండి.
జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం
అతిగా ఆలోచించడం వల్ల కలిగే ఒత్తిడి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అది కడుపుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. అతిగా ఆలోచించడంతో ఒత్తిడి వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.
రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాలు
అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి ఎక్కువై శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఎలివేటెడ్ కార్టిసాల్ స్థాయిలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.