NTR , Charan : ట్రిపుల్ ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే.. చెప్పడం కష్టం. కానీ ఫ్యాన్స్‌తో పాటు పలు మ్యాగజైన్స్.. సమయం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అదరగొట్టాడని, చరణ్ చించేశాడని చెబుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే.. చెప్పడం కష్టం. కానీ ఫ్యాన్స్‌తో పాటు పలు మ్యాగజైన్స్.. సమయం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అదరగొట్టాడని, చరణ్ చించేశాడని చెబుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే ఎవరు బెస్ట్ యాక్టర్.. అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తునే ఉన్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోల్ నిర్వహిస్తునే ఉన్నారు. తాజాగా మరోసారి ఎవరు బెస్ట్ యాక్టర్ అనే చర్చ మొదలైపోయింది. వాస్తవానికి ఆస్కార్ నామినేషన్స్ సమయంలో తారక్‌కు చోటు దక్కడం ఖాయమని పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రిడిక్షన్స్ చెప్పారు. కానీ అది ప్రిడిక్షన్‌కు మాత్రమే పరిమితమైంది. కానీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచి.. రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు చరణ్, తారక్ ఇద్దరు కూడా బెస్ట్ యాక్టర్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌లో యాక్షన్ మూవీ కేటగిరీలో ఉత్తమ నటులుగా నామినేట్ అయ్యారు. ఈ అవార్డు కోసం హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ వంటి వారితో పోటీ పడుతున్నారు. టాప్ 5లో ఇద్దరు మనవాళ్లే ఉండడం తెలుగోడిగా ప్రతి ఒక్కరు గర్వించ దగ్గ విషయం. మార్చి 16న విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు. ఈ విషయంలో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నా.. ఇద్దరిలో ఎవరికి అవార్డ్ వరిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఎవరో ఒకరు ఈ అవార్డ్ కొట్టేస్తే.. హిస్టరీ క్రియేట్ చేసినట్టే. అయితే ఈ అవార్డ్ వచ్చిన, రాకపోయినా.. మనోళ్లు ఆ రేంజ్‌కు వెళ్లారంటే మామూలు విషయం కాదు.