Samantha : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నుంచి వస్తున్న మూడో సినిమా శాకుంతలం. తమిళ్ మూవీ కాతువాకుల రెండు కాదల్, యశోద వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది సమంత. ఇక ఇప్పుడు శాకుంతలంగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత నుంచి వస్తున్న మూడో సినిమా శాకుంతలం. తమిళ్ మూవీ కాతువాకుల రెండు కాదల్, యశోద వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది సమంత. ఇక ఇప్పుడు శాకుంతలంగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. అయితే యశోద సినిమా రిలీజ్ సమయంలో.. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ సమయంలో సమంత చాలా ఎమోషనల్ అయింది. ప్రమోషన్స్‌లో ఏడ్చేసింది కూడా. దాంతో ఆమె అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు సమంత పూర్తిగా కోలుకుంది. వరుస పెట్టి సినిమాల షూటింగ్స్‌లలో పాల్గోంటోంది. బాలీవుడ్ సిటాడెల్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్‌తో బిజీగా ఉంది. అయితే ఏప్రిల్ 14న గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం రిలీజ్ అవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది సామ్. అయితే అది నిన్న మొన్నటి ముచ్చట. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌కు దూరమైంది సామ్. దీంతో అసలు సమంతకు ఏమైందనే.. డౌట్స్ వచ్చాయి. ఈ సినిమాకు ప్రీమియర్స్ షోష్ వేయగా.. మిక్స్డ్ టాక్ రావడంతో.. ప్రచారానికి దూరమైందనే టాక్ నడిచింది. అయితే తాజాగా సామ్ దీని పై క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తనకి ఆరోగ్యం బాగాలేదని.. జ్వరంతో పాటు గొంతు కూడా సరిగ్గా లేకపోవడంతో బ్రేక్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి. కానీ ఫైనల్‌గా సమంత కూల్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. మరి శాకుంతలం సినిమా ఎలా ఉంటుందో చూడాలి.