Keerthy suresh: ఓనమ్ చీరలో మెరిసిపోయిన స్టార్ హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎలాంటి పాత్ర అయినా అలవోగా చేయాలంటే కీర్తి తర్వాతే. మహానటి సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక కీర్తి ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఓనమ్ సందర్భంగా చీరకట్టులో దిగిన చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల దసరా సినిమాలో వెన్నెల పాత్రలో అదరగొట్టింది.
డీ గ్లామర్ లుక్ లో కూడా అందంగా కనిపించింది. ఆమె అందానికీ, నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
ఆ పాత్రలో కీర్తి కాకుండా మరెవరూ ఇంత అద్భుతంగా నటించరేమో అన్నట్లుగా నటించింది.
అయితే నిజం చెప్పాలంటే కీర్తి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అందంగా ఉండేది. కానీ తర్వాత చాలా స్లిమ్ గా మారింది.
సన్నగా మారిన తర్వాత ఆమె అందం తగ్గిందనే చెప్పాలి. మళ్లీ ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచుతోంది.
తాజాగా ఓనమ్ సందర్బంగా చీరకట్టులో అందంగా మెరిసింది.
తెలుపు రంగు చీరలో ఎంత అందంగా ఉందో. స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ఓనమ్ శారీ కి పెయిర్ చేసింది. దానికి మ్యాచింగ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ పెయిర్ చేసింది దానికి మ్యాచింగ్ గా బుట్టలు ధరించింది.
హెయిర్ లూస్ గా వదిలేసింది. కీర్తి ఈ లుక్ లో దేవకన్యలా మెరిసిపోయింది. కేరళ వాసులు ఈ పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
ఇదిలా ఉండగా దసరా తర్వాత కీర్తి నటించిన సినిమా భోళా శంకర్. ఓ పక్క హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్నా, చెల్లెలి పాత్రలో నటించడం విశేషం.
ఈ మూవీలో హీరోయిన్ కంటే, చెల్లెలి పాత్రకే ఎక్కువ మైలేజ్ ఉండటంతో ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
ప్రస్తుతం కీర్తి కొత్త కథలు వింటున్నట్లు తెలుస్తోంది.