Diabetes : దానిమ్మతో రక్తంలో చక్కెర పెరుగుతుందా?

మధుమేహం ఉన్న వారు ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు? అనే విషయంలో కచ్చితమైన అవగాహనతో ఉండటం ఎంతైనా అవసరం. మరి దానిమ్మకాయ రక్తంలో చక్కర శాతాన్ని అమాంతం పెంచేస్తుందా? అసలు షుగర్‌ ఉన్న వారు వీటిని తినొచ్చా? లేదా? తెలుసుకుందాం రండి.

  • Written By:
  • Updated On - March 30, 2024 / 10:09 AM IST

pomegranate: ఈ మధ్య కాలంలో అన్ని వయసుల వారిలోనూ మధుమేహ సమస్య కనిపిస్తోంది. చక్కెర వ్యాధి ఉన్న వారు తినే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్‌లు తక్కువగా తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అందులో భాగంగా అన్ని పండ్లనూ తినరు. అలాగే చాలా మంది దానిమ్మ పండునూ తీసుకునేందుకు వెనకాడుతుంటారు. మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిజంగా దానిమ్మ పండు తినకూడదా? తింటే ఎంత మోతాదులో తినొచ్చు లాంటి సందేహాలన్నింటికీ ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి.

చదవండి : రూ. 70వేల మార్కును దాటిన బంగారం ధర

దానిమ్మ పండులో సహజంగానే బోలెడు పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రత్యేకంగా పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీలో కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పగటిపూట ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల మధుమేహం ఉన్నవారిలో హానికరమైన ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు సమర్థవంతంగా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అదనంగా, ఇది డయాబెటిస్ మెల్లిటస్ ద్వారా వచ్చే గుండె సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇలా గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే దానిమ్మ(pomegranate) రక్తంలో చక్కర స్థాయిల్ని నియంత్రిస్తుంది.

చదవండి :  లాంబొర్గిని కార్ల  రికార్డు సేల్స్‌!

మిగిలిన విషయాలు సరే. మరి దీని నుంచి వచ్చే చక్కెరల సంగతేంటని చాలా మందికి అనుమానం రావచ్చు. దానిమ్మలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరం పనిచేసేందుకు కావాల్సిన శక్తిని ఇస్తాయి. దీని నుంచి వచ్చే మంచి ప్రభావాల్ని పొందాలనుకున్నవారు పరగడుపున ఈ రసాన్ని తాగండి. లేదా వ్యాయామానికి ముందూ దీన్ని తీసుకోవచ్చు. దీనిలో ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, దానిమ్మ పండ్లను తినే ముందు మీ వైద్యునితో మాట్లాడండి. వీటిలోని చెక్కరల వల్ల మీ శరీరం ఎలా రెస్పాండ్‌ అవుతోందో తెలుసుకోండి. అందుకు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్‌ని ఉపయోగించండి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను దానిమ్మ ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది సహకరిస్తుంది. రోజుకో చిన్న దానిమ్మ తినడం వల్ల పెద్దగా తేడా ఏమీ ఉండదు కానీ అంతకంటే ఎక్కువ వద్దు.