Tata Play: Tata Play joins hands with Amazon Prime
Tata Play: ప్రముఖ సంస్థ టాటా ప్లే అమెజాన్ ప్రైమ్‌తో చేతులు కలిపింది. తమ డీటీహెచ్, బింజ్ కస్టమర్లకు ప్రైమ్ వీడియో ప్రయోజనాలను అందించనుంది. వివిధ ప్యాక్‌లతో సబ్స్క్ర్రైబర్లు టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్ లైట్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. టాటా ప్లే డీటీహెచ్ సబ్స్క్రైబర్లు నెలకు రూ.199తో ప్రారంభమయ్యే ఏ పాక్నైనా ఎంచుకోవచ్చు. దీంతో వివిధ రకాల టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్ కంటెంట్ లభిస్తుంది. అదే బింజ్ చందాదారులు ప్రైమ్ లైట్‌తో కలిపి 30కిపైగా ఓటీటీ యాప్‌లను ఎంచుకోవచ్చు. ప్రైమ్ వీడియో కలిపి ఆరు ఓటీటీలను ఎంచుకుంటే నెలకు రూ.199 చెల్లించాలి. అదే 33 యాప్‌లు కావాలంటే రూ.349 చెల్లించాలి.
కొత్త ప్లాన్లలో నచ్చిన ఓటీటీలను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంది. టాటా ప్లేలో ప్రైమ్ లైట్‌తో కూడిన ప్యాకేజీలు ఎంచుకున్నవాళ్లకి వీడియో కంటెంట్‌తో పాటు అమెజాన్ ఈకామర్స్ షిప్పింగ్, షాపింగ్ ప్రయోజనాలు కూడా అందుతాయి. ఆర్డర్ చేసిన రోజు లేదా తర్వాత రోజు డెలివరీ ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే సేల్‌లో ముందుగానే పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. మరోవైపు కొత్త ప్లాన్లతో పాటు టాటా ప్లే డీటీహెచ్ కస్టమర్లు అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రాయితీ ధరతో పొందవచ్చు. వారికి షిప్పింగ్, షాపింగ్, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ ప్రయోజనాలు సహా ఐదు స్క్రీన్లపై ప్రైమ్ వీడియో కంటెంట్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది.