బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు ఏజ్ గ్యాప్ ఎఫైర్స్ కొత్తేం కాదు. అలాగే ఒకరితో కొన్నాళ్లు షికారు చేసి.. ఇంకొన్నాళ్లు ఇంకొకరితో తిరిగి.. ఆ తర్వాత వేరొకరిని పట్టుకోవడం.. బ్రేకప్‌ల మీద బ్రేకప్ చెప్పడం.. బీ టౌన్ ముద్దుగుమ్మలకు బాగా అలవాటైన పనే. కాకపోతే కొందరు కత్రీనా కైఫ్, దీపిక పదుకొనే, ఆలియా భట్ లాంటి వాళ్లు కెరీర్ స్టార్టింగ్‌లో షికారు చేసినా.. చివరికి పెళ్లి చేసుకున్నారు. అయినా హీరోయిన్లుగా గ్లామర్ ట్రీట్ ఇస్తునే ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫిబ్రవరిలో పెళ్లి పీఠలెక్కబోతున్నారు. కానీ ఓ ముదురు జంట మాత్రం కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తు హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. మలైకా అరోరా భర్తతో విడిపోయి.. తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె న్యూ ఇయర్ సందర్భంగా అతడితో రొమాంటిక్ పిక్స్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగానే.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్‌తో మళ్లీ వార్తల్లోకెక్కాడు. అసలు ఈ స్టార్ కిడ్ ఇంకా సినిమాల్లోకి రాకముందే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఆర్యన్ ఖాన్‌కి అమ్మాయి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఆర్యన్ ఖాన్ ఎక్కడుంటే అక్కడ హాట్ బ్యూటీస్ ఉండాల్సిందే. వాళ్లతో షికారు చేస్తు డ్రగ్స్ తీసుకుంటూ.. దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఇటీవలె డ్రాగ్స్ వివాదంలో కొన్నాళ్లు జైళ్లో కూడా ఉండి వచ్చాడు. ఇంకా ఈ వివాదం అయిపోకముందే.. ఐటెం బ్యూటీ నోరా ఫతేహితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఈ ఇద్దరు ఒకే అభిమానితో ఫోటోకు ఫోజిచ్చారు. దాంతో కలిసి తిరుగుతున్నారనే టాక్ ఊపందుకుంది. నోరా ఫతేహి బాహుబలిలో మనోహరి పాటలో చిందేసింది. ప్రస్తుతం ఆమెకు 30 ఏళ్లు.. ఆర్యన్ ఖాన్ వయస్సు 25 ఏళ్లు. అయినా ఈ ఇద్దరి మధ్య డేటింగ్ ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా అయితే స్టార్ హీరో కొడుకు కాబట్టి.. మరో స్టార్ కిడ్‌ను పట్టేస్తాడని అనుకుంటారు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం రివర్స్‌లో వెళ్తున్నాడని చెప్పొచ్చు. అయితే ఇందులో నిజముందా.. లేదా అనేది బీ టౌన్‌కే తెలియాలి.