Samantha: నిన్న చెప్పులు, నేడు గౌను.. రేటుతో షాక్ ఇస్తున్న సమంత!
హీరో, హీరోయిన్లు వాడే డ్రెస్సులు, వాచీలు, గ్యాడ్జెట్స్ రేట్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ఏదైనా సరే లక్షలు, కోట్ల కాస్ట్ది అయి ఉండాల్సిందే. అందుకే ఎలాంటి ఫోటో షూట్ అయినా, ఈవెంట్ అయినా.. ఫలానా హీరో ఏం ధరించాడు, ఫలానా హీరోయిన్ డ్రెస్ ఎలా ఉంది? వాటి కాస్ట్ ఎంత అని సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా సమంత గౌను రేటు షాక్ ఇస్తోంది.
Samantha: ప్రస్తుత స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తెలుగులో ‘ఖుషి’, హిందీలో ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. షూటింగ్స్ కోసం అమ్మడు హైదరాబాద్ టూ ముంబై తెగ చక్కర్లు కొడుతోంది. రీసెంట్గా సామ్ ఎయిర్ పోర్ట్ లుక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఫ్యాషన్‌కే బ్రాండ్ అంబాసిడర్లా ఉంటే సమంత (Samantha).. లుక్‌కి అంతా ఫిదా అయ్యారు. లూజ్ వైట్ ప్యాంట్.. దాని మీద టైట్ బ్లాక్ స్లీవ్ లెస్ టాప్.. నడుముకు బ్లాక్ జాకెట్.. ముఖానికి మాస్క్.. కళ్ళకు కళ్లద్దాలు.. చిన్నహెయిర్ క్లిప్ పెట్టి జుట్టును వదిలేసి..ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఫోటోల్లో సమంత (Samantha) చెప్పులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. దాంతో ఆ చెప్పులు రేటు తెలుసుకొని షాక్ అయ్యారు నెటిజన్స్. లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన ఆ చెప్పుల ధర అక్షరాలా రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొంబై ఏడు రూపాయలు అని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు గౌను రేట్ షాక్ ఇస్తోంది. ప్రస్తుతం సమంత (Samantha) టర్కీలో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. అక్కడ ‘ఖుషి’లోని ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్ (sam). నిండుగా ఉన్న గౌన్‌లో అలా పడుకొని రిలాక్స్ అవుతోంది. ప్రస్తుతం ఆ డ్రెస్ రేట్ అమ్మో అనేలా ఉంది. దాని రేటు అక్షరాలా లక్షన్నర రూపాయలు ఉంటుందని అంటున్నారు. దాంతో సమంత (Samantha) చాలా కాస్ట్లీ గురూ అంటున్నారు నెటిజన్స్. సమంత ఒంటి పై ఉన్న ఏ వస్తువు తీసుకున్నా లక్ష రూపాయలకు తక్కువగా ఉండదేమోనని అంటున్నారు. ఏదేమైనా.. సమంత అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి.