Ram Charan : రీసెంట్గా ఆస్కార్‌లో భాగంగా అమెరికా వెళ్లాడు చరణ్. అయితే ఇక్కడ నుంచి స్వామి మాల వేసుకుని వెళ్లారు చరణ్. కానీ న్యూయార్క్‌లోని ఓ ఆలయంలో 21 రోజులు పూర్తి అవడంతో మాల తీసేశారు.
రీసెంట్గా ఆస్కార్‌లో భాగంగా అమెరికా వెళ్లాడు చరణ్. అయితే ఇక్కడ నుంచి స్వామి మాల వేసుకుని వెళ్లారు చరణ్. కానీ న్యూయార్క్‌లోని ఓ ఆలయంలో 21 రోజులు పూర్తి అవడంతో మాల తీసేశారు. ఇంకేముంది రియల్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ బయటకొచ్చేశాడు. చరణ్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రెజెంటర్స్లో ఒకరిగా వ్యవహరించనున్నారు చరణ్. ఇప్పటికే అమెరికా ఫేమస్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా షో’లో పాల్గొన్నాడు చరణ్. ఈ సందర్భంగా చరణ్ న్యూయార్క్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అక్కడి వీధులు అరుపులు, కేకలతో నిండిపోయింది. ఫోటోల కోసం ఎగబడ్డారు అభిమానులు. దాంతో స్యయంగా చరణే దగ్గరికెళ్లి మరీ ఒక ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. అయితే అక్కడికి వచ్చిన సమయంలో చరణ్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. అచ్చు సినిమాల్లోలాగే చరణ్ మాసివ్ ఎంట్రీ అదిరిపోయింది. అమెరికా సెక్యూరిటీ ఫోర్స్ చరణ్ కార్ డోర్ తీయగా.. బీస్ట్‌లా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఆ వీడియోకి విక్రమ్, కెజియఫ్ సినిమాల బీజిఎం యాడ్ చేసి మ్యాన్ ఆఫ్ మాసెస్ రామ్ చరణ్, ఓజి అంటూ ట్రెండ్ చేస్తున్నారు మెగాఫ్యాన్స్. అయితే ఇదంతా ఆర్ఆర్ఆర్ క్రేజ్ వల్లేనని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌తో పాటు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. అందుకే చరణ్, తారక్‌కు హాలీవుడ్ లెవల్ క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఏదేమైనా ఫారిన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రేజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.