చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. గతంలో ఈ నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలారు. వీళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండేది. అయితే నెక్స్ట్ జనరేషన్ హీరోలు రేసులోకి రావడంతో.. ఈ సీనియర్ హీరోల హవా కాస్త తగ్గింది. ప్రస్తుతం వెంకీ, నాగ్ రేసులో వెనకబడిపోగా.. చిరు, బాలయ్య మాత్రం యంగ్ హీరోలకు ధీటుగా దుమ్ముదులుపుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఇద్దరి మధ్య పోటీ నెక్స్ట్ లెవల్లో ఉండబోతోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కోసం మెగా, నందమూరి అభిమానులు నువ్వా నేనా అంటున్నారు. కానీ మెగా హీరోలు మాత్రం బాలయ్య సినిమాను ప్రమోట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆహాలో వస్తున్న అన్‌స్టాపబుల్ షోతో దుమ్ముదులుపుతున్నాడు బాలయ్య. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ కూడా ఈ టాక్ షోకు రావడం విశేషంగా మారింది. ఈ నెల 27న, పవన్ ఎపిసోడ్‌ను షూట్ చేయబోతున్నారట. దీని కోసం హరహర వీరమల్లు సినిమాకు బ్రేక్ ఇచ్చాడట పవన్. అయితే అంతకు ముందే.. వీరసింహారెడ్డి సెట్స్‌లో పవన్‌ను చూసి షాక్ అయ్యారు నెటిజన్స్. ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారింది. జనవరి 6న సీమ గడ్డపై వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ పవన్ ఈ ఈవెంట్‌కు వస్తే మాత్రం.. అన్నయ్య చిరంజీవి సినిమాకు పోటీగా బాలయ్య సినిమాను ప్రమోట్ చేసినట్టే. పైగా మైత్రీ మూవీ మేకర్స్ మెగాస్టార్‌ను కూడా బాలయ్య కోసం రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే జనవరి 8న వైజాగ్‌లో జరగనున్న ‘వాల్తేర్ వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్యను తీసుకురావాలని భావిస్తున్నారట. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం.. కానీ బాలయ్య ఈవెంట్‌కు పవన్ గెస్ట్ అనేసరికి.. వీరయ్య పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. అయినా అన్న సినిమాను కాదని పవన్ అంత పని చేస్తాడా.. అనేది డౌటే. మరి బాలయ్య కోసం చిరు, పవన్‌లలో ఎవరు గెస్ట్‌గా వస్తారో చూడాలి.