గోవాలోని ఓ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు సహా 23 మంది మృతిచెందారు. ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ ఘటనాస్థలిని పరిశీలించారు. క్లబ్లో భద్రతా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో ముగ్గురు కాలి, మిగిలిన వారు ఊపిరాడక మృతిచెందారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.