గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర గోవాలోని అర్పోరాలో ‘బర్చ్ బై రోమియో లేన్’ బీచ్ వద్ద ఉన్న నైట్ క్లబ్లో అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతిచెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ కుమార్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఘటనాస్థలికి వెళ్లారు.