వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరగనుంది. అన్ని మ్యాచులు నోయిడాలో నిర్వహించనున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. ఈ లీగ్లో మొత్తం 6 జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టులో 9 మంది ఉంటారు. వీరిలో నలుగురు మహిళలు తప్పనిసరి. అన్ని జట్లలో ఐదుగురు భారత రెజ్లర్లతోపాటు నలుగురు విదేశీ రెజ్లర్లకు ఛాన్స్ కల్పించారు.