జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే బాలయ్య.. అన్ స్టాపబుల్ షో కి రానున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో పై చాలా హైప్ వచ్చేసింది. అయితే… ఈ షోకి ముందే… పవన్ , బాలయ్యతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ -2 షో షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న బాలకృష్ణ, పవన్ కల్యాణ్ షో షూటింగ్ కానుంది. అయితే అంతకంటే ముందుగానే వీరిద్దరూ ఓ షూటింగ్ స్పాట్ లో కలిశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరి సినిమాల షూటింగ్స్ జరిగాయి.
హరిహర వీరమల్లు, వీర సింహారెడ్డి సినిమాల షూటింగ్ గ్యాప్లో ఇద్దరు స్టార్స్ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఏకాంత భేటీలో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇవాళ జస్ట్ వీరిద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నందుకే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటే…ఇక అన్ స్టాపబుల్ షో టెలికాస్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.