తమిళ నటుడు, TVK అధినేత విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా ముగించాలని చూస్తున్నట్లు సమాచారం. కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు ఆమెకు రూ.250 కోట్ల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యక్తిగత విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎలాంటి విజువల్స్ లీక్ కాకూడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ పోస్టర్ అభిమానుల్లో ఒక్కసారిగా భారీ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉండబోతుందని టాక్.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కల్కి’ సీక్వెల్‌గా ‘కల్కి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై నటి దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘కల్కి 2’లో తన పాత్ర నిడివి మొదటి భాగంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే తొలి భాగంలో ‘రోక్సీ’ అనే పాత్రలో మెరిసిన దిశా, రెండో భాగంలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిప...
తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి హోలీ సందర్భంగా ‘బాల్ రాజ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో తరుణ్ భాస్కర్ ‘సూపర్ మ్యాన్’ గెటప్‌లో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK111’ రాబోతుంది. ఈ మూవీ మార్చి 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం మంచు మనోజ్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’లో కలిసి నటించిన ఈ ఇద్దరూ, పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనుండటం హాట్ టాపిక్‌గా మారింది.
RJ బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న మూవీ ‘కరుప్పు’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక కష్టాల్లో ఉన్నారనే విషయం తెలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించాడు. ఆమె కుటుంబ దీనస్థితిని చూసి చలించిన ఆయన, శ్యామల , ఆమె కుమార్తె నిత్యావసరాలు, వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందేలా శాశ్వత ఏర్పాట్లు చేశాడు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారిణికి అండగా నిలిచి బన్నీ తన ఉదారతను చాటుకున్నాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ మూవీలోని ‘రై రై రా రా’ పాట విడుదలైన 24 గంటల్లోనే 46.1 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విశేషమేమిటంటే, రెండో స్థానంలో కూడా ఇదే సినిమాలోని ‘చికిరి చికిరి’ (29.19 మిలియన్ వ్యూస్) నిలిచింది. మూడో స్థానంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోని ‘దేఖ్‌లేంగ...
‘సలార్ 2’పై నిర్మాత విజయ్ కిరగందూర్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని, మొదటి భాగం రూ. 700 కోట్లు వసూలు చేయడంతో రెండో భాగాన్ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ క్వాలిటీ విషయంలో రాజీపడరని, అందుకే కొంత ఆలస్యమైందని స్పష్టం చేశాడు. ప్రభాస్-హోంబలే ఫిల్మ్స్ డీల్‌లో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది.
ఐపీఎల్ ప్రియులకు జియో హాట్‌స్టార్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 26 నుంచి మే 31 వరకు జరిగే ఈ సీజన్‌లో క్రికెట్‌తో పాటు వినోదాన్ని పంచేందుకు 100 మైక్రో డ్రామాలను సిద్ధం చేసింది. 60 నుంచి 180 సెకన్ల నిడివి గల ఈ ఎపిసోడ్‌లను మ్యాచ్‌ల మధ్యలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండనున్నాయట.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, బుచ్చిబాబు తన తదుపరి లక్ష్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, త్వరలోనే కథ వినిపించనున్నాడని తెలుస్తోంది. ‘పెద్ది’ భారీ విజయం సాధిస్తే, ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కడం ఖాయమని టాలీవుడ్ వర్గాల టాక్.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. నన్ను నమ్మి బాధ్యత ఇచ్చిన సంస్థకు మంచి అవుట్‌పుట్ ఇవ్వాలని టీచర్‌లా కష్టపడి పనిచేశాను. పెట్టిన ఖర్చంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాట ఇచ్చినట్లుగానే మంచి చిత్రాన్ని తీశాను’ అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ‘ఈ యుద్ధం నిజానికి జీసస్, అల్లా మధ్య జరుగుతున్న పోరాటం వంటిది. ఇందులో ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతాను’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘RC17’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కృతి సనన్ నటించనున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ మార్క్ మాస్ ఎమోషన్స్‌తో పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని టాక్.