Shruti Haasan: అరుదైన వ్యాధి..తట్టుకోలేకపోతున్న శృతి హాసన్!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా కంటే.. హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్(Shruti Haasan). కానీ మధ్య మధ్యలో ఈ అమ్మడు అనుకోని వ్యాధి(rare disease) బారిన పడుతోంది. ఇక ఇప్పుడు మరోసారి డేంజరస్ వ్యాధితో బాదపడుతున్నట్టు తెలుస్తోంది.
శృతిహాసన్(sruthi hasan) కోలీవుడ్‌లో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో సాలిడ్ బ్రేక్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా భారీ ఆఫర్స్ అందుకుంది. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. కానీ మధ్యలో కొన్నాళ్లు హెల్త్ ఇష్యూస్ కారణంగా.. సినిమాలకు దూరమైపోయింది. ఇక గ్యాప్ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తు దూసుకుపోతోంది శృతి పాప. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి సలార్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో శృతి హాసన్ పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోనుంది.
ఇలాంటి సమయంలో శృతి హాసన్ అరుదైన వ్యాధి బారిన(rare disease) పడినట్టు తెలుస్తోంది. అమ్మడు కాస్త ఒత్తిడికి గురవగానే.. ఆటోమేటిక్‌గా ఆమెకు తెలియకుండానే విపరీతమైన కోపంతో రగిలిపోతోంట. ఎలా పడితే అలా అరుస్తుందట. ఎవ్వరు ఏంటి అనేది చూడడం లేదట. కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేక సతమతమవుతోంట. దాని నుంచి బయటపడేందుకు ఎన్ని రకాలుగా ట్రై చేసిన కుదరడం లేదట. కానీ కోపం వచ్చే ముందు మ్యూజిక్ వింటోందట. మామూలుగా శృతి హాసన్‌కు మ్యూజిక్ పై మంచి పట్టుంది. ఆమె సింగర్ కూడా..అందుకే కోపం వచ్చినప్పుడల్లా మ్యూజిక్ సైడ్ డైవర్ట్ అవుతోందట. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితి.. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.