ఆర్ఆర్ఆర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అసలు శంకర్, చరణ్ కాంబినేషన్ ఎవరూ ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ క్రేజి కాంబో సెట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు ఆర్సీ 15తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం పక్కా. శంకర్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నాడు. తండ్రి, కొడుకుగా నటిస్తున్నాడు. ఇప్పటికే లీక్ అయిన తండ్రి గెటప్ అదిరిపోయేలా ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఆర్సీ 15కి ఇస్తున్న ఎలివేషన్ చూసి.. సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అసలు తమన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఆర్సీ 15 మరో ఎత్తు అంటున్నాడు. మామూలుగానే శంకర్ సినిమా అంటేనే.. మ్యూజిక్ అల్బమ్ మోత మోగాల్సిందే. ఇక ఇప్పుడు తమన్ ఈ సినిమా, ఆ సౌండ్ వేరే అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. శంకర్ చూపు నుండి చెవుల వరకూ చేరడానికి.. తనకి ఇరవై ఏళ్లు పట్టిందని అన్నాడు. ఆయన టెక్నికల్‌గా బ్రిలియంట్, మ్యూజిక్ కూడా అలానే ఉంటుందని చెప్పాడు. అయితే RC 15 లో ఉద్యమం సాంగ్ గురించి ఇప్పుడే రివీల్ చేయనని.. కానీ ఆ సౌండ్ వేరేలా ఉంటుందని అన్నాడు. దాంతో ఆర్సీ 15 ట్రెండిగ్లోకి వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. శంకర్.. తమ హీరోని నెక్స్ట్ లెవల్ ఎలివేషన్ ఇస్తాడని.. ట్రెండ్ చేస్తున్నారు. మరి అంచనాలను పెంచేస్తున్న ఆర్సీ 15 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.