మరో మూడు రోజుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం కావడంతో.. అమిగోస్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో.. అమిగోస్ పై మరింత హైప్ వచ్చింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. అమిగోస్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైం వచ్చేసి 139 నిమిషాలని తెలుస్తోంది. అంటే రెండు గంటల 19 నిమిషాలు. ఇది పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. సెన్సార్ రిపోర్డ్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను చూసి సెన్సార్ మెంబర్స్ ఫుల్ థ్రిల్ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమాలోని మ్యాజిక్ వర్కౌట్ అయితే.. కాసుల వర్షం ఖాయమంటున్నారు. ట్రిపుల్ రోల్లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ చూసి.. సినిమాలో కీ పాయింట్ ఏంటనే చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు సెన్సార్ బోర్డ్ కూడా సినిమా చాలా బాగా వచ్చిందని.. కొత్త దర్శకుడైనా కూడా.. రాజేంద్ర బాగా హ్యాండిల్ చేశాడని అంటున్నారట. దాంతో అమిగోస్ చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ అంటున్నారు. మరి కళ్యాణ్ రామ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.