»Is Mahesh Trivikram Title Announcement Time Fixed
Mahesh-Trivikram : ‘మహేష్-త్రివిక్రమ్’ మూవీ టైటిల్ ఆరోజేనా!?
Mahesh-Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిపోయింది. అసలు మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగుతోంది. కానీ నెక్స్ట్ రాజమౌళి ప్రాజెక్ట్ ఉండడంతో.. స్పీడ్ పెంచాడు మహేష్. ఇటీవలె రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్‌కు రెడీ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టులో సినిమా రిలీజ్ చేసేలా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. త్వరలోనే ఈ సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఉగాది పండుగ కానుకగా టైటిల్‌ను ప్రకటించబోతున్నారట. మార్చి 22న టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ లేదా టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్. ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. అయితే గతంలోను ఇలాంటి పుకార్లు షికార్లు చేశాయి. కాబట్టి ఉగాదికి టైటిల్ వస్తుందా, లేదా అనేది చూడాలి. అయితే చాలా రోజులుగా ఎస్ఎస్ఎంబీ 28కి ‘అర్జునుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్‌కు ‘అ’ సెంటిమెంట్ ఉండడంతో.. దాదాపుగా ఇదే లాక్ చేసినట్టు టాక్. ఇక పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.