»Hero Sivakarthikeyan Planted A Sapling As Part Of The Green India Challenge
Green India Challenge:లో భాగంగా మొక్క నాటిన హిరో శివకార్తికేయన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న తమిళ నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan) శనివారం కేబీఆర్ పార్క్(kbr park)లో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) మనందరి బాధ్యత. రాబోయే జనరేషన్ కు మనం అందించే కానుక. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు తమిళ్ స్టార్ హిరో శివకార్తికేయన్(Sivakarthikeyan). తన కొత్త సినిమా “మహావీరుడు” సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన శివకార్తికేయన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగంగా బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో మొక్కను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శివకార్తికేయ ప్రముఖ హీరోయిన్ నందితా శ్వేతా విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించి ఇవ్వాల మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని శివకార్తికేయన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన మిత్రుడు, తమిళ్ రాక్ స్టార్ అనిరూధ్ కు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ సినిమాస్ అధిపతి, సినీ నిర్మాత జాన్వీ నారాంగ్ తో పాటు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధులు పాల్గొన్నారు.