ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే.. అయ్యే ఎంత పనైంది, పాపం బన్నీ ఫ్యాన్స్.. అని అనక మానరు. అయితే దానికి కారణం కూడా అభిమానులే కావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. బన్నీ వైజాగ్ వెళ్లినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఫోటోస్ కోసం ఎగబడ్డారు. అయితే అంతమందిలో ఫోటో షూట్ అంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్నాడు బన్నీ. దాంతో కాస్త టైం చూసుకొని.. ఓ స్పెషల్ ఫోటో షూట్ ప్లాన్ చేశాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. మామూలుగా తమ అభిమాన హీరోలు కనబడితేనే.. తమను తాము మర్చి పోతారు ఫ్యాన్స్. ఇక ఫోటో సెషన్ అంటే ఊరుకుంటారా.. అందుకే బన్నీతో ఫోటో కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. అనుకున్న దాని కంటే అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో.. క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేకపోయింది అక్కడి సెక్యూరిటీ. దాంతో చేసేది లేక ఆ ఫోటో షూట్‌ని క్యాన్సిల్ చేశాడు బన్నీ. ఇంకేముంది.. బన్నీ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే హర్ట్ అయినట్టున్నారు. కొందరు బన్నీతో ఫోట్ మిస్ అయ్యామని బోరున ఏడ్చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. ప్రతీ సారి ఇలానే చేస్తున్నారని అభిమానులను నిరాశతోనే పంపిస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బన్నీ తన ఆర్మీ కోసం వైజాగ్‌లో షూటింగ్ అయ్యేలోపు.. మరోసారి ఫోటో షూట్ పెడతాడేమో చూడాలి.