ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజెంట్ మహేష్ ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు.. తిరిగొచ్చాక షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చి దశాబ్దానికి పైగానే అవుతుంది. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఓ సాలిడ్ అప్డేట్ వైరల్‌గా మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మైండ్ బ్లాంక్ సాంగ్‌లో మహేష్ స్టెప్పులకు థియేటర్ దద్దరిల్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’లో కళావతితో కలిసి చేసిన స్టెప్పులు అదరహో అనేలా ఉన్నాయి. ఈ రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దాంతో మరోసారి మహేష్‌తో అదిరిపోయే స్టెప్పులు వేయించేందుకు రెడీ అవుతున్నాడు శేఖర్ మాస్టర్. ఈ సినిమా కోసం ఓ సాంగ్‌ను కంపోజ్ చేయబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్. అయితే ఆ సాంగ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. అది ఐటెం సాంగ్ అయి ఉంటుందనే టాక్ ఊపందుకుంది. చాలా రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు శేఖర్ మాస్టర్ చెప్పిన మాటలను వైరల్ చేస్తూ.. ఐటెం సాంగ్ రెడీ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ ఖచ్చితంగా స్పెషల్ ఐటెం అని ఇప్పుడే చెప్పలేం.