»2 Of 2351 Official Allu Arjun Fix With Arjun Reddy Director
Allu Arjun : అఫీషియల్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో అల్లు అర్జున్!
Allu Arjun : ఇది నిజంగానే ఊహించని అనౌన్స్మెంట్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప ది రూల్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు.
ఇది నిజంగానే ఊహించని అనౌన్స్మెంట్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రూల్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 అయిపోయిన తర్వాతే ఈ కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ లోపే ‘రా’ కాంబో ఫిక్స్ అయిపోయింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ 2025లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. పుష్ప2తో పాటు త్రివిక్రమ్ సినిమా అయిపోయిన తర్వాతే ఉంటుందని అంటున్నారు. సందీప్ రెడ్డి కూడా ఈలోపు రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు సందీప్. ఆ తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాతే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే ఈ క్రేజీ కాంబో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో పోలీస్ క్యారెక్టర్ చేయిస్తున్నాడు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఎటువంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తాడనేది ఎగ్జైటింగ్‌గా మారింది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.