Hit tv Exclusive Interview With Sr Journalist Dheeraj Appaji
Sr Journalist Dheeraj Appaji: ఆదిపురుష్ మూవీకి టైటిల్ కరెక్టుగా సరిపోయిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ (Sr Journalist Dheeraj Appaji) అన్నారు. హిట్ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మూవీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. నరేష్.. మళ్లి పెళ్లి, సమంత శాకుంతలం సినిమాల గురించి కూడా విశ్లేషించారు. ఆదిపురుష్ మూవీకి సంబంధించిన ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు క్రేజీ రాలేదని చెప్పారు. అందుకు గల కారణం.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా.. పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ను సింపుల్‌గా.. గ్రాఫిక్స్ తక్కువగా చేసి చూపడంతో జీర్ణించుకోలేకపోయారని వివరించారు. ఆ తర్వాత వదిలిన ట్రైలర్, టీజర్ వల్ల మూవీకి హైప్ వచ్చిందని వివరించారు.
ఆదిపురుష్ మూవీకి రూ.500 కోట్ల బడ్జెట్ అని తెలిసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్లే రూ.430 కోట్ల బిజినెస్ జరిగిందని అప్పాజీ (Appaji) వివరించారు. బాహుబలి సిరీస్ మూవీస్ తర్వాత ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ అంతగా ఆడలేదు. ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే రూ.430 కోట్ల బిజినెస్ జరిగిందని వివరించారు. అంటే సినిమా, డిజిటల్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ నుంచి ఎంత మొత్తం వస్తుందో చూడాలని కోరారు. రాముడి రూపంలో గతంలో ఎన్టీఆర్, శోభన్ బాబు మూవీస్ తీసిన జనం ఆదరించారు. ఇప్పుడు ప్రభాస్‌ను కూడా అంగీకరించారని వివరించారు.
సినిమాలకు పిల్లర్స్ పిల్లలే అని అప్పాజీ అంటున్నారు. వారికి నచ్చితే థియేటర్‌కు తీసుకెళ్లే వరకు ఊరుకోరని వివరించారు. పెద్దలు అయితే ఓటీటీలోకి వస్తే చుద్దాంలే అనుకుంటారు. కానీ పిల్లలు అలా కాదన్నారు. ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ పిల్లలకు నచ్చడంతో సక్సెస్ అయ్యిందని.. వారికి కనెక్ట్ అయ్యిందని తెలిపారు.