Shaitan Team Exclusive Interview: సైతాన్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. పచ్చి బూతులతో ఉండగా.. ఇక సిరీస్ ఎలా ఉంటుందనే డిస్కషన్ జరుగుతోంది. ఆ సిరీస్ నటినటులతో హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. సిరీస్ చేయడానికి గల కారణం, జనాల నుంచి స్పందన తదితర అంశాలపై ఇంటర్వ్యూ జరిగింది. ట్రైలర్ రిలీజ్ కాగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. సిరీస్‌లో నటించిన జాఫర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను 3 తమిళ సినిమాలు చేశానని వివరించారు. ఆగస్ట్, సెప్టెంబర్‌లో విడుదల అవుతాయని చెప్పారు. సైతాన్ సిరీస్ నుంచి ఆఫర్ రాగా క్యారెక్టర్ చేయడానికి ఆలోచించానని వివరించారు. నిజ జీవితంలో అలా చేయలేం అని.. అందుకే నటించానని వివరించారు.
సైతాన్ సిరీస్ యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ అవుతుందని హీరోయిన్ ఒకరు తెలిపారు. సిరీస్‌లో బూతులు ఉన్నా.. లాంగ్వేజ్ ఇబ్బందికరంగా ఉందన్నారు. డైరెక్టర్ మహి వి రాఘవ చాలా మంచి వారని, తమకు ఇబ్బంది కలుగనీయలేదని వివరించారు. సిరీస్ చేసే సమయంలో ఎంజాయ్ చేశామని.. ఏ సీన్ కూడా చేయనని చెప్పలేదని తెలిపారు. మదర్ రోల్ చేసిన సావిత్రి కూడా తమిళనాడుకు చెందిన వారు. సిరీస్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో యంగ్ ఏజ్, అలాగే కొద్దీ సేపు ఓల్డ్ ఏజ్ పాత్ర ఉంటుందని చెప్పారు. తనకు తెలుగు తెలియదని.. డైరెక్టర్ సీన్ చెబితే.. తమిళ్, ఇంగ్లిష్‌లో రాసుకొని, డైలాగ్స్ ప్రాక్టీస్ చేశానని వివరించారు. తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే.. తెలుగు చక్కగా నేర్చుకుంటానని చెబుతున్నారు.
సైతాన్ వెబ్ సిరీస్ ఈ నెల 15వ తేదీ నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవనుంది. రానా నాయుడు వెబ్ సిరీస్‌లో న్యూడిటీ గురించి చర్చ జరిగింది. చాలా మంది చూడటంతో.. నెట్ ప్లిక్స్ ఇండియాలో నంబర్ వన్ స్థానానికి వచ్చింది. ఇప్పుడు సైతాన్ కూడా అదే రేంజ్లో ఉంటుందని ఫిల్మ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.