Ramesh-Padma: ఇటీవల వచ్చిన మేము ఫేమస్ మూవీ హిట్ టాక్ అందుకుంది. ఆ మూవీలో హీరో తల్లిదండ్రులుగా నటించిన రమేశ్- పద్మతో హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. వారి నేపథ్యం.. సినిమాల్లోకి ఎలా వచ్చారో వివరించారు. డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ తనకు ముందే తెలుసు అని పద్మ చెప్పారు. అడిషన్ చేసిన తర్వాత కాల్ చేసి.. హీరో మదర్ అవకాశం అని చెప్పారని.. థ్రిల్లింగ్‌గా అనిపించిందని వివిరించారు. మేము ఫేమస్ యూత్ టచ్ మూవీ అంటున్నారు.
నాలుగేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చానని పద్మ వివరించారు. తన చెల్లి ద్వారా సినిమాలపై ఆసక్తి కలిగిందని చెప్పారు. మల్లేశం మూవీ.. కొత్త పోరడు వెబ్ సిరీస్ చేశానని తెలిపారు. కొత్త పోరడు వెబ్ సిరీస్ చూసి ఇప్పటికీ తనకు అవకాశాలు వస్తున్నాయని వివరించారు. పరేషాన్ మూవీలో క్యారెక్టర్ చేశానని.. రానా అందరితో చక్కగా ఉంటారని అన్నారు. తనవి రిలీజ్ కావాల్సిన 10 సినిమాలు ఉన్నాయని తెలిపారు. రమేష్ మంచి కో యాక్టర్ అని.. మేము ఫేమస్‌లో తమ కాంబినేషన్ బాగుందని చెప్పారు. సుమంత్ ప్రభాస్, హీరో, డైరెక్టర్ అని అనుకోలేదు.. తమతో సరదాగా ఉన్నాడు. ఇంట్లో మనసుల మాదిరిగా ఉండి.. షూటింగ్ కంప్లీట్ చేశామన్నారు.
1998లో ఇంటర్ పూర్తయిన తర్వాత సిటీ వచ్చానని.. సినిమాల్లో నటించే ట్రై చేసి తిరిగి ఊరు వెళ్లిపోయానని రమేశ్ చెప్పారు. అవకాశాలు రాక.. అప్పులతో వెళ్లానని వివరించారు. డిగ్రీ తర్వాత పెళ్లి చేసుకున్నానని.. సినిమాలపై ఇంట్రెస్ట్‌తో సిటీ వచ్చి 30 సీరియల్స్ చేశానని తెలిపారు. మెల్ అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చానని అప్పటినుంచి తనకు అవకాశాలు వస్తున్నాయని చెబుతున్నారు. 30 సినిమాల వరకు చేయగా.. 15 హీరో ఫాదర్ రోల్ అని వివరించారు. బలగం మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ మంచి పేరు తెచ్చిందని చెప్పారు. బలగం ఫ్యామిలీ టచ్ అయితే.. మేము ఫేమస్ యూత్ టచ్ అని వివరించారు.