Today Horoscope:ఈ రోజు రాశి ఫలాలు (మార్చి 27, 2023)
Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి: పెద్దలతో గౌరవంగా నడుచుకుంటారు. మీకు గుర్తింపు లభిస్తుంది. బంధు మిత్రుల వల్ల లాభం కలుగుతుంది. శుభకార్యాల కోసం ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృషభ రాశి: వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యముతో ఉల్లాసం లభిస్తుంది. శత్రువులతో సంధి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంటికి సంబంధించిన పనులపై శ్రద్ద పెరుగుతుంది. బంగారు వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి: వ్యాపార వ్యవహారాలలో వివాదాలు ఉంటాయి. భయం వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. జ్వరం, ఇతర స్వల్పకాలిక వ్యాధులు రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు ప్రతికూలిస్తాయి. సోమరితనం వల్ల పనులు ఆలస్యం అవుతాయి.
కర్కాటక రాశి: ప్రభుత్వ కార్యాలయాలలో పనులు తొందరగా పూర్తికాకపోవడం వల్ల అశాంతి ఏర్పడుతుంది. వాహన మూలక అసౌకర్యము ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణములు ఎక్కువ ఉండే అవకాశం. రాజకీయ నాయకులకు అనుకోని ఇబ్బందులు కలుగవచ్చును.
సింహ రాశి: కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వ్యక్తులతో కలయిక ఉంటాయి. సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. మనోల్లాసము కలుగుతుంది. వైద్య రంగంలోని వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్యా రాశి: మీ మాట తీరుపై విమర్శలు రావచ్చు. శరీర బాధలకు ఔషధ సేవనము చేస్తారు. వస్తు నష్టములు, ధనవ్యయం కలుగవచ్చు. స్థిరాస్థి వ్యవహారములను వాయిదా వేయడం మంచిది. కుటుంబం వల్ల అశాంతి ఏర్పడవచ్చును.
తులా రాశి: అద్భుతమైన ప్రసంగాలు వింటారు. ఆనందమయ జీవనం లభిస్తుంది. శరీర ఉల్లాసము కలుగుతుంది. తృప్తికరమైన భోజనం లభిస్తుంది. బహుమానం పొందుతారు. ధనప్రాప్తి కలుగుతుంది.
వృశ్చిక రాశి: బంధు మిత్రుల వల్ల అశాంతి కలుగవచ్చు. దూరప్రయాణములు చేయకపోవడం మంచిది. చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేయవలసి వస్తుంది. కోపం వలన అవమానములను ఎదుర్కొంటారు.
ధనుస్సు రాశి: క్రయ విక్రయాల వల్ల లాభం ఉంటుంది. శుభకార్యములకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇష్టమైన వ్యక్తులు ఇంటికి రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి: సన్మాలను పొందే అవకాశము, రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రయత్న కార్యములు సిద్ధిస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించే అవకాశం లభిస్తుంది. అక్కా చెల్లెల సహకారం ఆనందాన్ని కలిగిస్తుంది.
కుంభ రాశి: వాహన మూలక చికాకులు కలుగుతాయి. పితృ వర్గము వారితో విభేదాలు, శరీరంలో వేడి వల్ల బలహీనత కలుగవచ్చు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు తక్కువగా వుంటుంది. కార్యసిద్ధి కోసం ఇతరులను ఆశ్రయించ వలసి వస్తుంది.
మీన రాశి: వివాహ ప్రయత్నములు వాయిదా వేయడం మంచిది. మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర వ్యయము కలుగుతుంది. భోజనము రుచించదు. విమర్శలను ఎదుర్కొంటారు.